లండన్ లో అక్బరుద్దీన్ : రాగానే అరెస్ట్

Priyanka Reddy
 మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై ఎట్టకేలకు రాష్ట్ర పోలీసులు స్పందించారు. ఒక వర్గాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ ఒవైసీని అరెస్టు చేస్తామని డిజిపి.దినేశ్ రెడ్డి ప్రకటించారు. అక్బరుద్దీన్ మరోసారి ఎక్కడా బహిరంగంగా మాట్లాడకుండా చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం అక్బరుద్దీన్ హైదరాబాద్ లో లేరని... ఆయన విదేశాల్లో ఉన్నారన్నారు. అక్బరుద్దీన్ కోసం అవసరమైతే ఇంటర్‌పోల్ సహాయం కూడా తీసుకుంటామని దినేశ్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే నాంపల్లి కోర్టు అక్బర్ పై కేసు నమోదు చేయాలని ఉస్మానియా పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించింది. లండన్ లో ఉన్న అక్బరుద్దీన్ తో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఫోన్ లో మాట్లాడినట్టు సమాచారం. ఈ మేరకు హైదరాబాద్ రాగానే నిర్మల్ పోలీస్ స్టేషన్ కు రావాలని సూచించినట్టు ఎస్పీ తెలిపారు. దీంతో ఆయన రాగానే అరెస్ట్ అవడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సోదరుడు మజ్లిస్ పార్టీ అద్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మాత్రం... తాము కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: